సెమీ బుల్లెట్ గా పేరు తెచ్చుకున్న వందేభారత్ ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చింది.ఈ ట్రైన్ సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడుస్తుంది.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 698 కిలోమీటర్లు ఉండగా.వందే భారత్ ట్రైన్‌కు ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి 8 గంటల 40 నిమిషాలు పడుతుంది.
ఇది పట్టాల పరిమితిని బట్టి 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో డిజైన్ చేసిన ఈ ట్రైన్ ఎంత వేగంగా వెళ్ళినా కుదుపులు ఉండవు.
దీనివల్ల ఈ ట్రైన్ జర్నీ చాలా వేగంగా, ఫాస్ట్‌గా, సుఖవంతంగా ఉంటుంది.అయితే ఇన్ని ప్రయోజనాలు అందించే దీని టికెట్ ధర సాధారణ ట్రైన్ లో టికెట్ ధరకంటే కాస్త ఎక్కువగానే ఉంది వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.
• విశాఖ టు రాజమండ్రి టు ఛైర్ కారు టికెట్ ధర రూ.625 కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ప్రైస్ రూ.1215
• విశాఖ టు విజయవాడ టు ఛైర్ కారు టికెట్ ధర రూ.960, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.1825
• విశాఖ టు ఖమ్మం టు ఛైర్ కారు ధర రూ.1115, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2130
• విశాఖ టు వరంగల్ టు ఛైర్ కారు టికెట్ ధర రూ.1310, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2540
• విశాఖ టు సికింద్రాబాద్ ఛైర్ కారు టికెట్ ధర రూ.1720.ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3170
ఈరోజు నడిచే ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంక్వయిరీ చేయవచ్చు.