మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఒక దారుణం జరిగింది.క్యాన్సర్ తో బాధపడుతున్న భార్య విదేశాల్లో చికిత్స చేయించాలని అడిగినందుకు ఒక ఎన్నారై భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు.
భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపి తను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.పోలీసులు తెలిపిన పూర్తి సమాచారం ప్రకారం కిరణ్(72) ఉష (69) ఇద్దరు భార్యాభర్తలు.
ఈ దంపతులు కాలిఫోర్నియాలోని ఫ్రీ మౌంట్ లో సుమారు 30 సంవత్సరాలు ఉండి ఈ మధ్యకాలంలోనే భారతదేశానికి తిరిగివచ్చారు.ఆ తర్వాత అహ్మదాబాద్ ప్రహ్లాద్ నగర్ లోని ఒక ఇంట్లో ఉండేవారు.
4 నెలల క్రితం వారు మకర్బాలోని ఆర్కిడ్ ఎక్సోటికా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు మారారు.అయితే స్వదేశానికి వచ్చిన తర్వాత ఉష గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారు.
క్యాన్సర్ సోకిన ఆమె చికిత్స కోసం అమెరికాకు తిరిగి వెళ్దామంటూ కిరణ్ ను చాలా సార్లు కోరింది.అందుకు కిరణ్ నిరాకరిస్తూ వచ్చాడు.

ఈ విషయమై గత కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి వారి మధ్య చికిత్స విషయమై ఘర్షణ మొదలైంది.దాని వల్ల కోపోద్రికుడైన కిరణ్ భార్య ఉష ను కత్తితో చాలా సార్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు.ఆ తర్వాత గురువారం ఉదయం బంధువులకు ఉష ఆత్మహత్య చేసుకుంది అంటూ సమాచారం అందించాడు.
ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.బంధువుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణలతోనే ఉన్న కిరణ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఉషా సోదరుడు మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్ఖేజ్ పోలీసులు కిరణ్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు.







