ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేయడం జరిగింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి… నాగబాబుపై ఆర్జీవి సెటైర్ లు వేశారు.
హలో పవన్ కళ్యాణ్ గారు.కొంచెం మీ భజన గారిని చూసుకోండి అంటూ.
పరోక్షంగా నాగబాబుపై వీడియో రూపంలో డైలాగులు వేశారు.ఆ వీడియోలో ఆర్జీవి మాట్లాడిన తీరు…”కొణిదల నాగబాబుగారు ఆయన తమ్ముడికి (పవన్ కళ్యాణ్), ఆయన అన్నయ్యకి (చిరంజీవి) ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు.
కానీ నాకు కాదు.మరొక విషయం ఏమిటంటే నేను జనసేన మీద గాని పవన్ కళ్యాణ్ మీద గాని చేసిన కామెంట్లు.
పవన్ అభిమానిగా చేశాను.అది అర్థం కాకపోవడం నా దురదృష్టం.

నాకన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ దురదృష్టం.ఎందుకంటే కేవలం తన అన్నయ్య కాబట్టి… ఇలాంటి సలహాదారులను మాత్రమే పెట్టుకుంటే.దాని తర్వాత పవన్ కళ్యాణ్ అవుట్ కం అనేది జనమే చెబుతారు గుడ్ నైట్ అంటూ ఆర్జీవి ట్విటర్ లో వీడియో పోస్ట్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







