కొందరికి తలలో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది.వారంలో రెండు సార్లు తలస్నానం చేసినప్పటికీ ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది.
తలలో అధికంగా చెమట పట్టడం, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటివి బ్యాడ్ స్మెల్ రావడానికి ప్రధాన కారణాలు.అయితే కారణం ఏదైనా ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగో తెలియక చాలా మంది తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా బ్యాడ్ స్మెల్ సమస్య ను వదిలించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి అన్నది ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు ఫ్రెష్ గులాబీ రేఖలను వేసుకోవాలి.
అలాగే సపరేట్ చేసి పెట్టుకున్న అలోవెరా జెల్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో నాలుగు చుక్కలు టి ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, నాలుగు చుక్కలు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఈ హెయిర్ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ కు ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ హెయిర్ టోనర్ ను వినియోగించాలి.

ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఈ విధంగా చేస్తే తలలో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం క్రమంగా తగ్గుతుంది.అలాగే తలలో చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
మరియు ఈ రెమెడీని పాటించడం వల్ల తలలో నుంచి మంచి సువాసన వస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.