జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు ఇబ్బంది లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పవన్ పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని తెలిపారు.
అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన స్వీకరిస్తానన్న వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రత్యక్ష రాజకీయాలు అప్పగించినా పని చేస్తానని స్పష్టం చేశారు.అనంతరం తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.
సామాన్యులకు కేటాయించే అద్దె గదుల ధరలు పెంచలేదని చెప్పారు.వీఐపీలకే కేటాయించే గదులకే ధరలు పెంచినట్లు వెల్లడించారు.







