యంగ్ హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా తో మరో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.కచ్చితం గా సక్సెస్ అవ్వాల్సిన మాచర్ల నియోజకవర్గం సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆ సినిమా యొక్క కలెక్షన్స్ మరీ దారుణంగా నమోదయ్యాయి.కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కూడా నితిన్ సినిమా ను కాపాడలేక పోయింది.
మాచర్ల నియోజకవర్గం సినిమా ఆమె కు కూడా తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది.ఇప్పుడు నితిన్ యొక్క దృష్టి అంతా కూడా వక్కంతం వంశీ దర్శకత్వం లో చేయబోతున్న సినిమా పైనే ఉంది.

అది కాకుండా ఇటీవలే వెంకీ కుడుముల దర్శకత్వం లో కూడా ఒక సినిమా ను చేసేందుకు నితిన్ ఓకే చెప్పాడు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చింది.ఆ సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్, రష్మిక జంటగా మరో సినిమా ముందుకు రాబోతుంది.
భీష్మ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యం లో ఈ హిట్ కాంబినేషన్ మరో హిట్ సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి నితిన్ ప్రస్తుతం చేస్తున్న వక్కంతం వంశీ సినిమా మరియు వెంకీ కుడుముల దర్శకత్వం లో సినిమా లు సక్సెస్ అయితేనే ఆయన కెరియర్ లో మరో అడుగు ముందుకు పడ్డట్లు అవుతుంది.లేదంటే ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగానే నితిన్ కెరియర్ కొనసాగుతుంది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాక్సాఫీస్ వద్ద నితిన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి అంటే కచ్చితం గా మంచి కథ మరియు దర్శకుడు అవసరం.
ఈసారి నితిన్ ఆ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడని అనిపిస్తుంది.మరి ఆయన సినిమాల పరిస్థితి ఏంటి అనేది ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







