టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే.అయితే గత ఏడాది ఆది పురుష్ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ టీజర్ అంతకు రెండింతలు విమర్శలను ఎదుర్కొంది.అంతేకాకుండా సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన మొదటి రోజు నుంచే వివాదంలో చిక్కుకుంది.
అయితే ఆది పురుష్ సినిమా టీజర్ విడుదలైన తర్వాత అందులో ప్రభాస్ లుక్స్ అలాగే సైఫ్ అలీ ఖాన్ లుక్స్ పై భారీగా ట్రోలింగ్స్ జరగడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు వినిపించడంతో సినిమాను అందులో కొన్ని భాగాలను ఎడిట్ చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.

అయితే ఆది పురుష్ సినిమాను మళ్ళీ ఎడిట్ చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.ఈ సినిమాకు సంబంధించిన వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మరొకసారి మరో వివాదం చుట్టుకుంది.అదేమిటంటే.
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ సినిమాకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వాజ్యంపై ప్రత్యుత్తరం దాఖలు చేయాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కు నోటీసులను జారీ చేసింది.కాగా ఈ సినిమాకు సంబంధించిన కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 21న జరగనుంది.
కుల్దీప్ తివారి దాఖలు చేసిన పిల్ పై ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందకుండానే సినిమా నిర్మాతలు ఆది పురుష్ సినిమా ప్రోమోని విడుదల చేశారని,ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.అంతే కాకుండా సీతాదేవి పాత్రలో నటించిన కృతి సనన్ నటించిన కాస్ట్యూమ్స్ పై కూడా పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.సినిమాలోని దేవుడి పాత్రలో నటిస్తున్న నటులు ప్రభాస్, కృతి సనన్ , సైఫ్ అలీ ఖాన్, దేవదత్ నాగే, సన్నీ సింగ్ లను కూడా ప్రతి వాదులుగా చేర్చారు.
ఈ పిటిషన్ లో నిర్మాత దర్శకుడు ఓం రౌత్ లు కూడా ప్రతివాదులుగా ఉన్నారు.మరోసారి ఇలా వివాదం చుట్టుకునేసరికి ప్రభాస్ అభిమానులలో ఆందోళన మొదలైంది.ఇన్ని వివాదాల మధ్య ఆది పురుష్ సినిమా విడుదల అవుతుందా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.







