ఆ డైరెక్టర్ తీసిన ప్రతి సినిమాలో రష్మికే హీరోయిన్.. ఇంత అభిమానమా అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు.రష్మిక నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా ఒక డైరెక్టర్ మాత్రం తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాలో రష్మికను ఎంపిక చేసుకుంటున్నారు.

 Rashmika Is The Only Heroine In Venky Kudumula Movie Details Here Goes Viral, Ra-TeluguStop.com

ఛలో సినిమాతో రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే.నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భీష్మ సినిమాలో సైతం రష్మిక హీరోయిన్ గా నటించారు.నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం రష్మిక అన్ని భాషల సినిమాలలో నటిస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

పాన్ ఇండియా సినిమాలలో కూడా రష్మికకు సినిమా ఆఫర్లు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ ప్రాజెక్ట్ కు వెంకీ కుడుముల నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రష్మిక రెమ్యునరేషన్ ఎక్కువే అయినా లక్కీ హీరోయిన్ కావడంతో ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.రష్మిక రేంజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పుష్ప2 తనకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందిస్తుందని రష్మిక భావిస్తున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలకు జోడీగా రష్మిక ఇంకా నటించలేదు.రష్మిక స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా ఆమె కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube