బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఇనయా సుల్తానా.మొదటి వారం నుంచి ఎటాకింగ్ తో ఆడియన్స్ ను అలరించిన ఇనయా ఫైనల్ వీక్ వరకు ఉంటుందేమో అనుకుంటే ఆమె మాత్రం టాప్ 5లో స్థానం దక్కించుకోలేదు.
బిగ్ బాస్ సీజన్ 6 వల్ల సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఇనయా ఒకరు.టాప్ 5 లో లేకపోయినా ఇనయాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇక లేటెస్ట్ గా ఇనయాకి ఓ బడా నిర్మాణ సంస్థ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్.
అయితే అందులో ఆమెది హీరోయిన్ రోల్ మాత్రం కాదట.
సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారట.పాత్ర నచ్చడంతో ఇనయా కూడా ఓకే చెప్పిందట.
ఈ ప్రాజెక్ట్ హిట్ అయితే అదే బ్యానర్ లో నెక్స్ట్ సినిమా హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తారట.

అందుకే ఇనయా కూడా ఈ అవకాశాన్ని ఓకే చేసిందట.ఆర్జీవీ తో స్టెప్పులేసి ఆ దెబ్బతో పాపులర్ అయిన ఇనయా బిగ్ బాస్ తో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది.ఇక వరుస సినిమా అవకాశాలతో అమ్మడు అదరగొట్టేస్తుందని తెలుస్తుంది.







