కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.
దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.
ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.తాజాగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్ ఉద్యోగాల కోతలను ప్రారంభించడంతో అది 3,200 మంది ఉద్యోగులు (6.5 శాతం)పై ప్రభావం చూపుతుందని అంచనా.
వేటు తప్పదని భావిస్తున్న ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఇప్పటికే అన్వేషణ ప్రారంభించారు.గోల్డ్‌మన్ సాక్స్‌లో హెచ్ 1 బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడే అవకాశం వుందని సమాచారం.టెక్సాస్‌లోని ఈ కంపెనీలో 1.7 సంత్సరాలు పనిచేసిన భారత్‌కు చెందిన శిల్ప సోనీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం కోల్పోయింది.దీంతో తన ఆవేదనను ఆమె లింక్డ్‌ఇన్ ద్వారా పంచుకున్నారు.

తాను భారత్‌లోని గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ అమెరికాలో ఎలా ఉద్యోగం సాధించగలిగింది అనే దానిపై శిల్ప వివరాలు తెలియజేశారు.తన కుటుంబంలో విదేశాల్లో మాస్టర్స్ చదివిన తొలి వ్యక్తిగా తనకు గర్వంగా వుందన్నారు.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సామాజిక, ఆర్ధిక పరిమితులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నట్లు సోనీ పోస్ట్ చేశారు.
విదేశాల్లో ఉద్యోగం కోల్పోయినప్పటికీ పోరాటాన్ని కొనసాగిస్తానని.

ఎక్కడ నుంచి తాను మొదలయ్యానో తెలుసుకున్నప్పుడు కొంచెం బాధ కలిగిందని ఆమె అన్నారు.అమెరికాలో తన ప్రయాణం ఇప్పుడే ముగియకపోవచ్చని ఇప్పటికీ ఆశిస్తున్నానని సోనీ ధీమా వ్యక్తం చేశారు.తాను పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నానని.
కొత్త ఉద్యోగం కోసం ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఉద్యోగ అవకాశాల కోసం తాను అన్వేషిస్తున్నట్లు సోనీ చెప్పారు.
ఈమె ఒక్కటే కాకుండా ఉద్యోగం కోల్పోయిన ఎంతోమంది పెట్టిన పోస్టులతో ప్రస్తుతం లింక్డ్ ఇన్ నిండిపోయింది.







