మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వరని, ఇచ్చేదే లేదనే విషయం ఎప్పుడో అర్థమయిపోయింది.కాంగ్రెస్ పార్టీలోనే ఆయన అధికారికంగా కొనసాగుతున్న, చాలాకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
కాంగ్రెస్ కీలక నాయకులు ఎవరితోనూ ప్రస్తుతం ఆయన టచ్ లో లేరు.పూర్తిగా సినిమా అంశాలపైనే దృష్టి పెట్టారు .వరుసగా సినిమాలు చేయడంతో పాటు , టాలీవుడ్ లో నెలకొన్న సమస్యల పైన దృష్టి సారించారు.పెద్దన్న పాత్రలో ఉండేందుకు చిరంజీవి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఇప్పటివరకు చిరంజీవి బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు ఆ పార్టీ తరఫున ఎన్నికలకు ప్రచారానికి వస్తారని 2019 ఎన్నికల సమయంలో హడావిడి జరిగిన చిరు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు .ఇక 2024 లో తప్పకుండా చిరంజీవి జనసేన తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తారని, అలా కుదరకపోయినా కనీసం ఒక వీడియో సందేశం ద్వారానైనా జనసేనకు మద్దతు ప్రకటిస్తూ, జనాలకు తన సందేశం ఇస్తారని అంతా అంచనా వేస్తూ ఉండగా, ప్రస్తుతం చిరంజీవి ఏపీలో నెలకొన్న రాజకీయ అంశాలపై తాజాగా స్పందించారు.తాను 100% రాజకీయాల్లోకి రానని తెగేసి చెప్పారు.ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ఏపీ రాజకీయాలతో తనకు సంబంధం ఏమిటని చిరంజీవి ఎదురు ప్రశ్నిస్తున్నారు.వీలైనంత వరకు రాజకీయ అంశాలకు దూరంగా ఉండడం ద్వారా అందరివాడుగా గుర్తింపు తెచ్చుకునేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు .అందుకే తన సోదరుడు పవన్ కళ్యాణ్ తరచుగా వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ జగన్ ను తిట్టిపోస్తున్న, చిరంజీవి మాత్రం తమ్ముడు బాటలో వెళ్లకుండా… ఏపీ ప్రభుత్వం తనకు అన్ని రకాలుగా సహకరిస్తుందని, జగన్ పరిపాలన బాగుందని, సినిమా అంశాలకు సంబంధించి జగన్ అన్ని విధాలుగాను తమకు సహకరిస్తున్నారు అంటూ సమయం దొరికినప్పుడల్లా జగన్ ను పొగడ్తలతో జగన్ ముంచేత్తుతున్నారు.

తాజాగా విశాఖలో నిర్వహించిన వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ వేడుకల అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్ ను చిరంజీవి పొగిడారు.ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేయరనే విషయం ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చేసింది.కనీసం వీడియో సందేశాన్ని ఇచ్చేందుకు కూడా చిరంజీవి ఆశక్తి చూపించకపోవడంతో, ఇప్పటి వరకు జనసేనకు మద్దతుగా చిరంజీవి వస్తారని ఆశలు పెట్టుకున్న పవన్ తో పాటు ఆ పార్టీ నాయకులకు చిరంజీవి తాజా రాజకీయం మింగుడు పడడం లేదు.







