అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా 2021 సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.పుష్ప 2 సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం 2022 డిసెంబర్ లో విడుదల చేయాల్సి ఉంది.కానీ భారీ గా సినిమా ను చేయాలి అనే ఉద్దేశ్యంతో కథ రెడీ చేయడానికే దర్శకుడు సుకుమార్ ఏకంగా ఏడాది సమయం తీసుకున్నాడు.2022 సంవత్సరం డిసెంబర్ లో కనీసం సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు అవ్వలేదు.ఎట్టకేలకు సినిమా యొక్క షూటింగ్ ప్రారంభం అయ్యింది.

దాంతో అభిమానులు 2023 సంవత్సరం డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తారు అంటూ అంతా భావించారు.కానీ పుష్ప 2 సినిమా విడుదల 2023 లో ఉండే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు.గతంతో పోల్చితే పుష్ప 2 సినిమా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు సంవత్సరానికి ఎక్కువ పట్టే అవకాశాలు ఉన్నాయి.

2024 సంక్రాంతికి సినిమా ఉంటుందేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఎవరికి తోచిన విధంగా వారు పుష్ప 2 యొక్క విడుదల తేదీ గురించి మాట్లాడుకుంటున్నారు.కానీ ఇప్పటి వరకు సుకుమార్ కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు కానీ విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
సినిమా విషయానికి వస్తే పార్ట్ 2 లో అంతకు మించి అన్నట్లుగా స్టార్ కాస్టింగ్ ఉండబోతుంది.హిందీ స్టార్స్ చాలా మంది సినిమా లో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పుష్ప 2 ఉంటుందని మాత్రం సుకుమార్ చెబుతున్నాడు.అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాలని ఇప్పటికే భావించాడు.
అందుకే ఆయన భారీ మొత్తంలో పారితోషికం అందుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.







