ఏపీ రాజకీయాలు హిట్ ఎక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో, అన్ని రాజకీయ పార్టీలు తమ ఆస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
వివిధ పార్టీల నాయకులు, అధినేతలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు, ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈసారి వైసిపి 175 స్థానాల్లోనూ గెలవాలనే టార్గెట్ ను విధించుకోగా, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వైసిపి పాలన రాకుండా చూసేందుకు టిడిపి ,జనసేన, బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
బిజెపి , జనసేన పార్టీలు ప్రస్తుతం పొత్తు కొనసాగిస్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా బేటి అయ్యారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంపై ఒక క్లారిటీ వచ్చిందని, అంతా భావిస్తున్నారు.
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంతటి సత్తా లేకపోయినా, జనసేన కలిసి వస్తే కచ్చితంగా అధికారంలోకి రావచ్చనే లెక్కల్లో టిడిపి, బీజేపీలు ఉన్నాయి .

అదీ కాకుండా విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేయవచ్చు అనే అంచనాతో ఉన్నాయి.అందుకే జనసేన ను కలుపుకు వెళ్లేందుకు అటు టిడిపి, ఇటు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే కనీసం 445 స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను జనసేన ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం , ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండడంతో జనసేనకు ఆ స్థాయిలో డిమాండ్ పెరిగింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టిడిపిలు పొత్తు పెట్టుకోకుండా వైసిపి సేటైర్లు వేస్తోంది.పైకి గంభీరంగా ఒంటరిగా పోటీ చేస్తామంటూ వైసీపీ చెబుతున్న టిడిపి , జనసేనలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తమకు ఇబ్బందులు ఏర్పడతాయనే భయము అధికార పార్టీ వైసీపీలో కనిపిస్తోంది.

అందుకే పవన్ చంద్రబాబు మీటింగ్ వేస్తూ టిడిపి తో కలిసి వెళ్తే గతంలో ఎదురైన పరాబాదులో ఎదురవుతాయి అని జనసేన ఎప్పటికీ రాజకీయంగా పుంజుకోదని చంద్రబాబు జనసేన ను వాడుకుని వదిలేస్తారు అంటూ పదేపదే వైసిపి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది.కానీ పవన్ వైసీపీ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఏ పార్టీలతోనైనా కలిసి వైసిపిని ఓడించేందుకు సిద్ధమని ప్రకటనలు ఇస్తున్నారు.ఈ విషయంలో బిజెపి, జనసేన పై అసంతృప్తితో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ పై ఎటువంటి విమర్శలు చేయలేని పరిస్థితి బిజెపిది.మొత్తంగా చూసుకుంటే జనసేనకు ఒంటరిగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేకపోయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం కీ రోల్ పోషించే స్థాయిలో ఆ పార్టీ ఉంది
.







