కూతురిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. చాలా మిస్ అవుతున్నా అంటూ?

తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి చిన్నల్లుడు అయినా కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కళ్యాణ్ దేవ్ చిరంజీవి కూతురు శ్రీజను రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 Kalyaan Dhev Missing Her Daughter Navishka Shares Special Post , Kalyan Dev, Sre-TeluguStop.com

ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.కళ్యాణ్ దేవ్ నటుడు అయినప్పటికీ సినిమాల ద్వారా కంటే పర్సనల్ లైఫ్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యాడు.

అయితే మొన్నటి వరకు శ్రీజ, కళ్యాణ్ దేవ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.వారిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని, విడాకులు కూడా తీసుకోబోతున్నారని, అందుకే ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పటివరకు ఆ వార్తలపై అటు శ్రీజ కాని, ఇటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు.కాగా గత కొంతకాలంగా కళ్యాణ్ దేవ్ తన భార్య కూతురికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.దాంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.అంతే కాకుండా శ్రీజ తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్‌లో శ్రీజ కొణిదెలగా పేరు మార్చుకోవడం, అలాగే భర్త కల్యాణ్‌ దేవ్‌ను అన్‌ఫాలో చేయడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.

అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ కూడా మెగా ఫ్యామిలీ లో జరిగే ఎటువంటి ఫంక్షన్లకు హాజరు కావడం లేదు.కాగా శ్రీజ కల్యాణ్‌ దేవ్‌ల చిన్నకూతురు నవిష్క ప్రస్తుతం తల్లి దగ్గర ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా నవిష్క లేటెస్ట్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఆ వీడియో చూసిన కల్యాణ్‌ దేవ్‌ మిస్‌ యూ సో మచ్‌ అంటూ కామెంట్‌ చేశాడు.గతంలోనూ కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ కల్యాణ్‌ దేవ్‌ కనపడలేదు.అప్పుడు కూడా నవిష్కను తలుచుకుంటూ తెగ బాధపడిపోయిన కల్యాణ్‌ దేవ్‌ నువ్వే నా ప్రపంచం అంటూ స్పెషల్‌ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరొకసారి కూతుర్ని తలుచుకుంటూ ఎమోషనల్‌ అవ్వడంతో పాటు చాలా మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube