హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు.సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయింపు, కొత్త సీఎస్ అంశంపై కేసీఆర్ చర్చిస్తున్నారు.
ఈ కీలక సమావేశానికి మంత్రులతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, శాంత కుమారిలు హాజరైయ్యారు.అయితే సీఎస్ గా సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే.
అదేవిధంగా ఆయన ఏపీ క్యాడర్ కు వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చింది.







