మిర్చి సినిమా తో దర్శకుడు గా పరిచయమైన కొరటాల శివ ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కొరటాల శివ సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్నట్లుగా ఆయనకు పేరు దక్కింది.
దాంతో మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఆచార్య సినిమా ను చేసే అవకాశాన్ని ఇచ్చాడు.కొరటాల శివ పై నమ్మకం తో పూర్తి బాధ్యత ను ఆయన పై వదిలి చిరంజీవి దారుణమైన పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది.
ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అత్యంత దారుణమైన చిరంజీవి సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఒక్క సారిగా పాతాళానికి కొరటాల శివ యొక్క స్థాయి పడి పోయింది అన్నట్లుగా ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

చిరంజీవి మరియు రామ్ చరణ్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ మెగా ఇమేజ్ ని కాపాడుకుంటూ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.ఆ విషయం లో కొరటాల శివ విఫలమయ్యాడు.అందుకే ఆయన తదుపరి సినిమా చాలా ఆలస్యం అవుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా కన్ఫర్మ్ అయింది.ఆ సినిమా కు సంబంధించి కొరటాల శివ యొక్క పారితోషకం ఎంత అనేది ఆసక్తికరంగా జరుగుతుంది.
ఆచార్య సినిమా కు తీసుకున్న పారితోషికంలో కనీసం సగం పారితోషికం కూడా ప్రస్తుతం కొట్టాల శివ తీసుకోవడం లేదు అనేది టాక్.

అసలు విషయం ఏంటీ అంటే కొరటాల శివ సన్నిహితుడు సినిమా యొక్క నిర్మాణంలో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నాడు.అందుకే నామినల్ పారితోషికాన్ని ఆయన అందుకుని తర్వాత లాభాల్లో వాటాను సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఎన్టీఆర్ 30 సినిమా వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.







