మన భారతదేశంలో అతిథులకు ఎంతటి మర్యాదనిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ ఇంటికి అతిధి గా వచ్చింది శత్రువు అయిన వారు ఎప్పటికీ మర్చిపోలేనంత అతిథి మర్యాదలను చేసి పంపుతారు.
ప్రవాసి భారతీయ దినోత్సవం సందర్భంగా భారత్ కు వచ్చిన ఒక బ్రిటిష్ మహిళ ఇక్కడి ఆతిథ్యం చూసి తెగ మురిసిపోయారు.భారతీయుల అతిథి మర్యాదల గురించి ఏకంగా ముఖ్యమంత్రి కి చెప్పుకొని సంబరపడిపోయారు.
ఐక్యరాజ్యసమితి తరపున ఆమె భారత్ కు అతిథిగా వచ్చారు.సోమవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆటో ఎక్కిన ఆమెకు భారతీయ ఆతిథ్యం ఎంతో గొప్పగా ఒక ఆటో డ్రైవర్ చాటి చెప్పాడు.
ఇంగ్లీష్ రాకపోయినా తన మర్యాదతో ఆమె ప్రశంసలను పొందాడు.మీరు మా దేశానికి వచ్చిన అతిధి అంటూ విదేశీ మహిళ ఇచ్చిన డబ్బులు కూడా తీసుకోలేదు.
దీంతో ఆమె ఆటో డ్రైవర్ మర్యాదకు ఫిదా అయిపోయింది.

తన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆటో డ్రైవర్ ఉదాంతాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పంచుకున్నారు.ఆ ఆటో డ్రైవర్ నాతో ఎంతో మర్యాదగా ప్రవర్తించాడని తెలిపారు.అతడికి ఆంగ్లం రాకపోయినా అతిధి మర్యాదలకు మాత్రం లోటు రాకుండా ప్రవర్తించాలని ముఖ్యమంత్రితో ఆటో డ్రైవర్ గురించి మాట్లాడారు.
వివిధ దేశాల వారిని ఏకం చేసే ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా ఉంది.మీకు నా ధన్యవాదాలు అని బ్రిటిష్ మహిళ ముఖ్యమంత్రితో మాట్లాడారు.అతిథులకు భారతీయుడు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్వయంగా తెలుసుకొని తెగ మురిసిపోయింది.అతిథి దేవోభవ అనే మాటను స్ఫూర్తిగా తీసుకొని ఆ ఆటో డ్రైవర్ ఒక బ్రిటిష్ మహిళతో ప్రవర్తించిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







