యూట్యూబ్ గురించి ఇక్కడ తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఎందుకంటే యూట్యూబ్ అనేది కేవలం వినోదం ఇవ్వడమే కాకుండా మంచి ఆదాయ వనరుగా కూడా వుంది.
దాంతోనే యూట్యూబ్ క్రియేటర్స్ పుట్టుకొచ్చారు.కాగా టిక్ టాక్ బాగా ఫేమస్ అయిన తరువాత యూట్యూబ్ కూడా షార్ట్ వీడియోలను తీసుకు వచ్చింది.
కాగా మనదేశంలో టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత యూట్యూబ్ షార్ట్స్ బాగా పాపులారిటీ పెరిగింది.అయితే నిన్న మొన్నటివరకు యూట్యూబ్ షార్ట్స్ కి మానిటైజేషన్ లేదు.
కాగా తాజాగా ఈ కొత్త సంవత్సరంలో షార్ట్స్ కి మానిటైజేషన్ మాడ్యూల్‌తో సహా కొత్త మాడ్యూల్‌లను చేర్చడానికి యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (వైపీపీ) నిబంధనలను పునరుద్ధరించినట్లు గూగుల్ ప్రకటించింది.

కాగా ఈ షార్ట్ మానిటైజేషన్ మాడ్యూల్ కంటెంట్ క్రియేటర్లకు డబ్బు సంపాదించడానికి ఆదాయవనరుగా మారనుంది.గూగుల్ యాడ్స్ ద్వారా యూట్యూబ్ లఘు చిత్రాలతో డబ్బు ఆర్జించే అవకాశాన్ని అందిస్తుంది.ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఈ విషయంలో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత క్రియేటర్లు ఈ ప్రకటనల కొరకు ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.అంతే కాకుండా, వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్, కామర్స్ ప్రోడక్ట్ అడెండమ్, ఇతర సంపాదన అవకాశాలను కూడా యూట్యూబ్ షార్ట్స్ లోకి చొప్పించారు.

ఈ కొత్త మాడ్యూల్స్ నుంచి ప్రయోజనం పొందాలంటే.కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్ ప్రోగ్రామ్ అప్‌డేట్ చేయబడిన నియమాలను అనుసరించాల్సి ఉంటుంది.దానికి ముందుగా వినియోగదారులందరూ కొత్త YPP నిబంధనలను సమీక్షించి, అర్థం చేసుకోవాలి, ఎందుకంటే YPPలో చేరడానికి లేదా కొనసాగడానికి ప్రాథమిక నిబంధనలను అంగీకరించడం చాలా అవసరం.వినియోగదారులు ఆ తేదీలోపు ప్రాథమిక నిబంధనలను అంగీకరించకపోతే.
వారి ఛానెల్ YPP నుంచి తీసివేయబడుతుందని గుర్తు పెట్టుకోవాలి.వారి మానిటైజేషన్ ఒప్పందం రద్దు చేయబడుతుంది.






