ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అప్పీల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ క్రమంలో పిటిషన్ పై వర్చువల్ విధానంలో వాదనలు కొనసాగాయి.
ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ట్రాప్ జరగలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే కోర్టుకు తెలిపారు.ట్రాప్ జరిగిన తర్వాత సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కేసు నమోదు రోజు నుంచి ఆటంకాలు సృష్టిస్తున్నారని, ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ కు నిరాకరించిందని వెల్లడించారు.అదేవిధంగా నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని తెలిపారు.
విచారణ అధికారిపై అనుమానాలు ఉంటే సరిపోదన్న దవే అనుమానాలపై ఆధారాలు ఉండాలని వెల్లడించారు.ఆ ఆధారాలతో కోర్టును ఒప్పించాలని పేర్కొన్నారు.
సీక్రెట్ కెమెరాల్లో నమోదైన ఆడియోను ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారన్నారు.నాలుగు ఎలక్ట్రానిక్ పరికరాలు అక్కడ అమర్చగా.
ఏసీపీ వాటిని సీజ్ చేశారని పేర్కొన్నారు.ఇవన్నీ మొదటి రిమాండ్ అప్లికేషన్ రోజే ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేశామని దవే కోర్టుకు వెల్లడించారు.
.






