తెలంగాణకు రేపు రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సాల్ రానున్నారు.ఈ మేరకు రేపు ఉదయం రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో బన్సాల్ సమావేశం కానున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 10 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరితో సమావేశాలు నిర్వహించాలన్న దానిపై చర్చించనున్నారు.
అనంతరం పార్లమెంట్ ప్రవాసి యోజనపైనా బన్సాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమంపైనా రిపోర్ట్ తీసుకోనున్నారని తెలుస్తోంది.
భువనగిరి, హైదరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఇంఛార్జ్ సునీల్ బన్సాల్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.