ఏపీ మంత్రులపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు – పవన్ కల్యాణ్ కలయికతో మంత్రులు ఉలిక్కపడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ అరాచకాలపై చంద్రబాబు, పవన్ మాట్లాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు.ప్రైవేట్ సైన్యంతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.
పోలీసులు సగం మంది జగన్ ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నారని మండిపడ్డారు.భిన్న ధృవాలైన బీజేపీ – లెఫ్ట్ ను ఒకే వేదికపైకి తెచ్చిన ఘటన ఎన్టీఆర్ ది అని కొనియాడారు.
అదే చంద్రబాబు సారథ్యంలో మళ్లీ పునరావృతం అవతుందేమోనని అభిప్రాయ పడ్డారు.







