నిర్మల్ జిల్లాలో చైనా మాంజ కలకలం సృష్టించింది.మాంజ దారం తగిలి ప్రమాదవశాత్తు బాలుడి గొంతు తెగింది.
తీవ్ర గాయం కావడంతో గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కుంటాల మండలం పెన్సికల్ పాడ్ లో ఘటన చోటు చేసుకుంది.
గాయపడిన బాలుడు గ్రామానికి చెందిన తుమ్మ వెంకటేశ్ గా గుర్తించారు.పొలం నుంచి ఎడ్లబండిపై వస్తుండగా మెడకు మాంజ తగిలిందని స్థానికులు చెబుతున్నారు.







