సర్పంచుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటం కోనసాగుతూనే ఉంటుందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ ఇందిరాపార్క్ లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మురికి కుప్పలే కన్పిస్తున్నాయని విమర్శించారు.గ్రామాల్లో చెట్టు ఎండిపోతేనే సర్పంచులను సస్పెండ్ చేస్తామంటున్నారు.
మూసీలో మనుషులు కొట్టుకుపోతే ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు.సర్పంచ్ హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.
పంచాయతీ నిధులను సర్కార్ దారి మళ్లించడంతో ఇప్పటికే కొందరు సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.గ్రామానికి గౌరవం పెరగాలంటే సర్పంచ్ కి గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు.







