మరో టాలెంట్ ని బయటపెట్టిన ఎన్టీఆర్.. లాస్ ఏంజిల్స్ లో తారక్ అదరగొట్టేసాడుగా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ కి తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు ఇతర దేశాలలో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Young Tiger Junior Ntr Talent Speaks American Slang At Los Angeles Details, Ntr,-TeluguStop.com

కాగా ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది.

ఇకపోతే తారక్ ఈ సినిమాతో తనలో దాగున్న ఒక్కొక్క ప్రతిభను అభిమానులకు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాకు ఒక మలయాళం లో తప్ప మిగతా అన్ని భాషల్లో తారక్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు.

మొన్నటికి మొన్న ఈ సినిమా జపాన్ లో విడుదల అవుతున్న సందర్భంగా అక్కడికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో స్పీచ్ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నాడు.దీంతో చాలామంది ఎన్టీఆర్ కు ఇంగ్లీష్,తెలుగు,హిందీతో పాటుగా జపనీస్ భాష కూడా వచ్చు అని అనుకున్నారు.

Telugu Language, Ntr, Los Angles, Ntrmulti, Rajamouli, Rrr-Movie

కానీ తారక్ లో అంతకుమించిన భాష నైపుణ్యం దాగి ఉందని తాజాగా మరొకసారి ప్రూవ్ అయింది.తాజాగా లాస్ ఏంజిల్స్ లో డీజీఏ థియేటర్లో స్క్రీనింగ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఈ షోకి రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ పలువురు హాజరయ్యారు.కాగా ఈ వేదికపై ఎన్టీఆర్ అమెరికన్ యాసతో మాట్లాడి అదరగొట్టేశారు.అమెరికన్ వెస్ట్రన్ ప్రజల్ని తన భాషతో సర్ప్రైజ్ చేశారు తారక్.తారక్ ఆ స్లాంగ్ లో మాట్లాడటం చూసి మీడియా మొత్తం షాక్ అయ్యారు.

Telugu Language, Ntr, Los Angles, Ntrmulti, Rajamouli, Rrr-Movie

ఒక తెలుగు నటుడు అమెరికన్ లాంగ్వేజ్ ని ఇరగదీస్తున్నాడుగా అంటూ అందరూ ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్యపోయారు.భారత్ అమెరికన్ లాంగ్వేజ్ లో మాట్లాడడంతో అక్కడి ప్రజలు మాత్రమే కాకుండా భారతీయ ప్రజలు సైతం అవాక్కయ్యారు.ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అందరూ అభిమానులు అయితే ఎన్టీఆర్ ని మల్టీ టాలెంటెడ్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube