ఈ ఏడాది బైక్ ప్రియులను ఆకట్టుకునే నాలుగు మోటార్ సైకిల్స్ రిలీజ్ కాబోతున్నాయి.ఇవి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్న పాపులర్ మోడల్స్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా వస్తున్నాయి.అందుకే ఇవి చాలామందిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తోంది మరి ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే టాప్ అప్ కమింగ్ బైక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650:
రూ.3.35 లక్షలు ధరతో 2023, జనవరి నెలలో అతిపెద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 రిలీజ్ అవుతుంది.గత సంవత్సరం రైడర్ మానియాలో ఈ మోటార్‌సైకిల్ అరంగేట్రం చేసింది.అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి.648సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్, ఫుల్-LED లైటింగ్ హెడ్‌ల్యాంప్ ఇందులో చెప్పుకోదగిన ఫీచర్లు.
మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్:

లిక్విడ్ కూల్ మోటార్, 4 స్పీడ్ గేర్ బాక్స్, 120కిలోమీటర్ రేంజ్, రూ.1.75 లక్షల ధరతో ఇదే ఏడాది మ్యాటర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా రిలీజ్ కానుంది.ఈ బైక్ 10.5kW మోటార్, 520Nm టార్క్ పవర్‌తో వస్తుందని సమాచారం.ఈ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌తో కనిపిస్తోంది.ఇందులో డ్యూయల్-ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్-స్టైల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్, Wi-Fi, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో టచ్-ఎనేబుల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450:

అడ్వెంచర్ బైక్ హిమాలయన్ 450 ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.హిమాలయన్ 450ని రాయల్ ఎన్‌ఫీల్డ్ వారి అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల నుంచి మరింత అధిక పర్ఫామెన్స్ కోరుకునే రైడర్‌ల కోసం ఒక అప్‌గ్రేడ్‌గా ప్లాన్ చేసింది.ఈ ADV బైక్ 450cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో 40bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని టాక్.ఇక దీని ధర రూ.2.80 లక్షలుగా ఉంటుంది.
హీరో ఎక్స్‌పల్స్ 400

మరో అడ్వెంచర్ బైక్ సెప్టెంబర్ నెలలో రూ.2.75 లక్షల ధరతో లాంచ్ కావచ్చు.ఇది హీరో ఎక్స్‌పల్స్ 200కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రానుంది.







