సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు దర్శనం ఇస్తాయో ఎవ్వరూ ఊహించలేరు.నేడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరడంతో సోషల్ మీడియా వినియోగం సాధారంగానే పెరిగి పోయింది.
దాంతో ప్రపంచం నలుమూలలా వున్న సంగతులు ఇట్టే తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలో కొన్ని రకాల వీడియోలు ఆహుతులను ఎంతగానో అలరిస్తూ ఉంటాయి.
దాంతో సదరు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా ఏదైనా ఒక వాహనం నడపాలంటే చక్రాలు తప్పనిసరి.అదే ట్రక్కు లేదా ట్యాంకర్ నడవాలంటే ముందు భాగంలో ఖచ్చితంగా చక్రాలు ఉండి తీరాల్సిందే… లేదంటే అలాంటి వాహనాలు నపడటం దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి.
కానీ, ఒక ట్యాంకర్ డ్రైవర్ మాత్రం ముందు టైర్లు లేకుండానే ట్యాంకర్ ట్రక్కును నడిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని ఒకసారి గమనిస్తే, అప్పటికే ప్రమాదానికి గురైన వాహనంలాగా కనబడుతోంది.
ఆ కారణంగా ముందు చక్రాలు ఊడిపోవడం మనం గమనించవచ్చు.కాగా ఆ వాహనానికి మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి.

అయితే ఆ వాహనంలోని వున్న సరుకు ఎంత ఇంపార్టెంట్ ఏమో గాని, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.ఆ ట్రక్కును అలాగే నడుపుకొంటూ రోడ్డుపైన వెళ్లడం మనం గమనించవచ్చు.దాంతో రోడ్డుపై అతి వేగంగా, ముందు టైర్లు లేకుండా వెళ్తున్న ఈ వాహనాన్ని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తన సత్తాని చాటుతోంది.దాంతో ముందు చక్రాలు లేకుండానే ట్రక్కు నడపడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇలాంటివి మన దేశంలోనే సాధ్యం అంటూ కాస్త ఎద్దేవా చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు.







