కుప్పంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న చంద్రబాబు..!

కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన ఇంకా ఉత్కంఠకు దారితీస్తోంది.ఇటీవలే ఆయన రోడ్ షో ని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే.

 Chandrababu Is Protesting On The Road In A Kuppam,tdp, Chandrababu, Kuppam, Cha-TeluguStop.com

ఆ సమయంలో పోలీసులకు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో లాఠీచార్జ్ చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో తన నియోజకవర్గంలో తనని తిరగకుండా అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారని పోలీసులపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతూ సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకొద్దని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవో 1కి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు.తమ రోడ్ షో అడ్డుకున్న ముఖ్యమంత్రి రాజమండ్రిలో రోడ్డు షో నిర్వహించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.నిన్న కూడా పలు ప్రాంతాలలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డు షోలు నిర్వహించారని ఆరోపించారు.

వైసీపీ నేతలకు ఒక రుల్.? తనకి మరో రూలా? అని పోలీసులను ప్రశ్నించారు.పోలీసులు బాధ్యతతో వ్యవహరిస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది.లేకపోతే తాను అధికారంలోకి వచ్చాక పోలీసులను మళ్ళీ గాడిలో పెడతానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నల్ల జీవోలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube