కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన కే జి ఎఫ్, కాంతార సినిమాలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.దానికి కారణం ప్రముఖ నటుడు కాంతార సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కిషోర్ కావడం విశేషం.
నిజానికి కే జి ఎఫ్, కాంతారా సినిమాలను నిర్మించింది హోంబలే ఫిలిమ్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఒకటే.అయితే ఈ రెండు సినిమాలకు కథ పరంగా, బడ్జెట్ పరంగా ఎటువంటి పోలికలు లేవు.
ఎక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిన కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తే.అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన కాంతారా సినిమా అనూహ్యంగా మంచి టాప్ తెచ్చుకొని 400 కోట్ల గ్రాస్ సాధించింది.
ఈ రెండు సినిమాల కథ విషయానికొస్తే కే జి ఎఫ్ సినిమాలో గోల్డ్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో తరికెక్కించారు స్టోరీ కొత్తది కాకపోయినా దర్శకుడు ప్రశాంత్ నిల్ అద్భుతమైన క్రియేటివిటీ,టేకింగ్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టగలిగింది.మరో సినిమా కాంతారా 90 నాటి రాచరిక పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు ఆనాటి ఆచారాలను ముఖ్యంగా పురాతన కోలన్ నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం సక్సెస్ సాధించాడు హీరో మరియు దర్శకుడు రుషబ్ శెట్టి.

ఇటీవలే మీడియా సమావేశంలో కాంతారా సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ కే జి ఎఫ్ సినిమా ఓ చెత్త సినిమా అంటూ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.ఈ విషయంపై కిషోర్ మాట్లాడుతూ ఇది సరైన పోలికనో కాదో తెలియదు కానీ నేను కేజీఎఫ్ చూడలేదు.అది నా టైప్ సినిమా కాదు.ఇది నా వ్యక్తిగత విషయం.
ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను అని కిశోర్ చెప్పుకొచ్చాడు.నటుడు కిషోర్ ఇప్పటికి పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు.
ప్రస్తుతం రెడ్ కాలర్ అనే హిందీ సినిమా నటిస్తున్నాడన్న సమాచారం.







