మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ధమాకా’. ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను త్రినాధరావు నక్కిన తెరకెక్కించాడు.ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న భారీ పోటీ మధ్యనే రిలీజ్ అయ్యింది.
ఈ బరిలో చాలా సినిమాలే వచ్చిన ధమాకా మాత్రమే రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని కలెక్షన్స్ రాబడుతుంది.
రవితేజకు క్రిస్మస్ సీజన్ మాత్రమే కాకుండా న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్ కూడా బాగా కలిసి వచ్చింది.
అలాగే అప్పటి నుండి ఈయనకు పోటీగా మరో సినిమా లేకపోవడంతో ఈయన ఇప్పుడు ఏకంగా 100 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
ధమాకా మ్యానియా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగకు ముందే సందడి కనిపిస్తుంది.
ఈ సినిమా రవితేజ కెరీర్ లో రికార్డ్ మొత్తంలో నమోదు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఈ సినిమా సక్సెస్ తో రవితేజ తన క్రేజ్ ఏంటో ఇలాంటి మాస్ సినిమా పడితే ఈయన స్టామినా ఎలా ఉంటుందో చూపించాడు.ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తూ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.
ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.