పాదయాత్ర సరే ...మంగళగిరి సంగతేంటి చినబాబు ? 

రాజకీయంగా తన సత్తా చాటుకునేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.గతంతో పోలిస్తే లోకేష్ పని తీరు బాగానే మెరుగుపడింది.

 Padayatra Ok...what About Mangalagiri Chinababu ,padayathra, Nara Lokesh, Tdp, M-TeluguStop.com

ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువు అయింది.మొదట్లో లోకేష్ నాయకత్వం పై పార్టీలోనూ అసంతృప్తి చెలరేగింది  కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే లోకేష్ పనితీరు పై విమర్శలు చేశారు.

అలాగే పార్టీని వీడి బయటకు వెళ్లే సమయంలోను చాలామంది కీలక నాయకులు లోకేష్ పైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు.అసలు లోకేష్ రాజకీయాలకి పనికిరాని వ్యక్తి అని, అనవసరంగా చంద్రబాబు తమ నెత్తిన లోకేష్ ను రుద్దుతున్నారు అన్నట్లుగా భావించే వారు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఆయన 2019లోని ఎమ్మెల్యేగా గెలిచి తమ సత్తా చాటుకోవాలని చూశారు.

కానీ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి  చెందారు.దీంతో రాజకీయంగా లోకేష్ పై మరిన్ని అనుమానాలు కలిగాయి.

  అయినా లోకేష్ మాత్రం తాను మళ్ళీ 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి తీరుతాను అంటూ శపథం చేశారు.అప్పుడప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సందడి చేస్తూ తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ ను మంగళగిరిలో గెలవకుండా చేసేందుకు వైసిపి వ్యూహాలు రచిస్తోంది.దీనిలో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని తెరపైకి తీసుకువచ్చింది.

ఆయన లోకేష్ కు ప్రత్యర్థిగా ప్రకటించబోతోంది .దీంతో లోకేష్ కు మంగళగిరిలో గెలవడం అంత ఆషామాసి కాదు.

 

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Mangalagiri, Lokesh, Padayathra-Political

పూర్తిగా నియోజకవర్గంలోనే మకాం వేసి, తను పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఎన్నికల వరకు పాదయాత్ర లోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు.దీంతో మంగళగిరిపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఏర్పడబోతోంది.దీంతో మంగళగిరిలో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసిన లోకేష్ ఇప్పుడు ఈ నియోజకవర్గ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు ? ఇక్కడ ఎలా తన పరపతి పెంచుకుంటారు ? రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే పాదయాత్ర ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎంత వరకు పనిచేస్తుంది అనేది మరింత ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube