తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది.ఉద్యమాల పురిటి గడ్డగా.
విప్లవాల నేలగా తులతుగింది.అలాంటి నెలలో నేతలు కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరు అగ్గి మీద గుగ్గిలం అవు తునే ఉంటారు.
అలాంటి ఖమ్మం మీద జెండా పాతిన కెసిఆర్ కు నేతలు రోజుకో మజిలీ చూపిస్తున్నారు.సీఎం కెసిఆర్ కు ఖమ్మం జిల్లా నేతలు తీరు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి.
జిల్లాలో పేరు మోసిన ముగ్గు రు నేతలు సై అంటే సై అనే స్థాయికి వివాదాలు తెచ్చుకున్నారు.ఒకవైపు మంత్రి పువ్వాడ అజయ్, ఇంకోవైపు తుమ్మల నాగేశ్వర రావు.
మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి.ఇలా ఒకరంటే ఒకరికి పడని నేతల లొల్లి జనవరి ఒకటవ తేది మొదలు అయింది.
ఆత్మీయ సమ్మేళనం పేరిట.అటు తుమ్మల ఇటు పొంగులేటి సభలు పెట్టీ.ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు.ఇద్దరి మధ్యన పువ్వాడ దూరి తన సిటుకు ఎసరు రాకుండా మాట్లాడారు.
అయితే ముగ్గురిలో పొంగులేటి కొంచం టంగ్ క్రాస్ చేసి .అధిష్టానం పైనే మాట్లాడాడు.ఎవరు అడ్డుకున్నా తన అనుచరులు అంతా పోటీ చేస్తారని వారికి హామీ ఇచ్చాడు.దాంతో పొంగులేటి మీద అటు తుమ్మల, ఇటు పువ్వాడ కెసిఆర్ కు చెప్పడం తో.
పొంగులేటి పార్టీ నుంచి సగణంపడానికి ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.అటు ఫిర్యాదులు అందాయో లేదో.
ఇటు అయన పదవికి ఎసరు వచ్చి పడింది.పొంగులేటి సెక్యూరిటీ నీ 2+2 కి ప్రభుత్వం తగ్గించేసింది.
అంతేకాదు అయన ఎస్కాట్ ను తేసేసింది.అక్కడితో ఆగకుండా ఇంటిదగ్గర ఉండే గన్ మెన్లను వెనక్కి తీసుకుంది.

పార్టీ బాధ్యతల విషం లో కూడా తుమ్మలకు ప్రియరిటీ ఇవ్వాలని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.దాంతో పొంగులేటి నీ పొమ్మనలేక పొగ పెడుతున్నారు అని మాటలు వినిపిస్తున్నాయి.మరి అయన ఇంతకాలం ఉన్న పార్టీ నీ వదిలి పక్క చూపులు చూస్తారా .? లేక కెసిఆర్ నీ ప్రసన్నం చేసుకొని.మిగిలిన నేతలకు చెక్ పెడతారా చూడాలి.







