ఎయిడెడ్ పాఠశాలల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఖాళీ ఎయిడెడ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విచారణలో భాగంగా టీపీఆర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.అదనంగా టీచర్లు ఉంటే శాశ్వత పద్ధతిలో బదిలీ చేయాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.







