మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
అయితే, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఎర్ర గంగిరెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టులో వాదనలు వినిపించింది.
కాగా ఈ కేసును ఇప్పటికే ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం బదిలీ చేసింది.