అన్ని స్థానాల్లో గెలిచేలా ... జగన్ చెప్పిన సీక్రెట్స్ ఇవే !?

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ పదేపదే రాబోయే ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు .రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 175 స్థానాల్లోనూ గెలుస్తామంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం నూరి పోస్తున్నారు .

 These Are The Secrets That Jagan Told To Win All Positions ,jagan, Ap Cm Jagan,-TeluguStop.com

మన లక్ష్యం 152 కాదని , 175 స్థానాలు అని జగన్ మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు.ఎక్కడికక్కడ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని,  అవన్నీ పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి మళ్ళీ తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులంతా పాటుపడాలంటూ జగన్ చెబుతున్నారు.

నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో 88% కుటుంబాలకు మంచి చేశామని, విద్య ,వ్యవసాయం,  వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని,  వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.

    ఇవన్నీ ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నాము కాబట్టి , ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని,  గడపగడపకు ప్రజలతో మమేకమై మన ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి ఆశీర్వదించాలని కోరాలని పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు.ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ను గెలిపించాలని జగన్ కోరారు.

ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు 175 స్థానాలు దక్కించుకునేందుకు జగన్ కొన్ని కొన్ని సూత్రాలను పార్టీ శ్రేణులకు వివరించారు.
   గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవ్వండి.

మూడున్నరేళగా చేస్తున్న మంచిని అక్కా,  చెల్లెమ్మలకు వివరించండి.వారి ఆశీర్వాదం తీసుకోండి .ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా,  అర్హత ఉండి లబ్ది పొందకపోతే దాన్ని పరిష్కరించి మంచి చేసి .అర్హులు ఎవరు మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే ఇంతగా దృష్టి పెడుతున్నామని అన్నారు. గతంలో ఎవరు ఈ విధంగా చేయలేదని,  ఏడాదిలో రెండుసార్లు అలాంటి వారికి అన్ని మంజూరు చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 175 సీట్లు మనమే గెలవాలి… అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది .ఏ వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా,  ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తోంది.
   

Telugu Ap Cm Jagan, Ap Tdp, Jagan, Ysrcp-Political

  మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి , చదువులు మారుతున్నాయి, ఆసుపత్రులు మారుతున్నాయి, ఆర్బికేల ద్వారా వ్యవసాయం మారుతుంది.ఇంత మార్పు అన్నది ఎప్పుడు జరగలేదు.వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తిస్థాయిలో వస్తుంది.

విద్య, వైద్యం వ్యవసాయం , తదితర రంగాల్లో మనం తీసుకువచ్చిన మార్పులన్నీ పూర్తిస్థాయిలో ఫలితాన్నిస్తాయని జగన్ చెప్పారు.పార్టీ మళ్లీ అధికారంలోకి 175 స్థానాలతో రావాలి అంటే , ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా పని చేయాలని,  ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలని మనకు ఓటు వేయని వారి ఇళ్లకు కూడా మనం వెళ్ళాలి.

చేసిన మంచిని వారికి వివరిస్తే ఖచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.మనం వెళ్లకపోతే తప్పు చేసినట్లు అవుతుంది.అందుకనే ప్రతి ఇంటికి వెళ్ళాలి అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి.మంచితనంతో మనం ప్రయత్నం చేయాలని జగన్ చెప్పారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube