కాశ్మీర్ మంచు కొండల్లో చిల్ అవుతున్న రేణు దేశాయ్... ఆద్య!

నటి రేణు దేశాయ్ తన పిల్లలతో ఒంటరిగా జీవితం గడుపుతున్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన పిల్లలతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లడం లేదా ఇండియాలోనే పలు ప్రాంతాలకు వెళ్తూ పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తుంటారు.ఇలా రేణు దేశాయ్ తరచు తన పిల్లలతో కలిసి వెకేషన్ వెళ్ళినటువంటి ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

 Renu Desai ,kashmir,adhya ,actress Renu Desai Vacations, Akhira, Kashmir Vacatio-TeluguStop.com

అయితే ఈసారి మాత్రం రేణు దేశాయ్ తన కుమారుడు అఖీరాను ఇక్కడే వదిలేసి కేవలం తన కూతురు ఆధ్యతో కలిసి కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లినట్టు తెలుస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చారు.

అయితే న్యూ ఇయర్ సందర్భంగా అకిరా ఇక్కడే తన స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోగా రేణు దేశాయ్ ఆద్య మాత్రం నార్త్ ఇండియాలో పలు ప్రాంతాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా కాశ్మీర్ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలను షేర్ చేశారు.

దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.

ఇక అకీరా మాత్రం డిసెంబర్ 31వ తేదీ తన తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా తిరిగి విడుదల కావడంతో ఈయన అభిమానుల మధ్యలో కూర్చొని సినిమా చూశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసింది.

ఇందులో రేణు దేశాయ్హేమలతా లవణం అనే పాత్రలో నటించబోతున్నట్లు మేకర్ వెల్లడించారు.ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube