యూత్ గ్రేటెస్ట్ ఫాలోయింగ్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పార్టీ జనసేనా.జనాసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ .
మొదట ప్రజారాజ్యం పేరుతో అయన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన పార్టీలో చురుగ్గా పని చేశారు.ప్రచారం లో సైతం అన్నతో పోటీగా విమర్శలు ఎక్కు పెట్టీ సత్తా చాటాడు.
అయితే తర్వాత మారిన రాజకీయాల వల్ల ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీ లో విలీనం అయింది.దాంతో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవి తీసుకోగా.
ఆ పార్టీ ఎమ్మెల్యే లు కొందరు మంత్రి పదవులు కూడా తీసుకున్నారు.ఇలా ఎదిగిన నేతలు చాలా మంది స్ట్రాంగ్ లీడర్లు గా మారారు .
అయితే అన్న రాజకీయం లో ఓనమాలు దిద్దిన పవన్ ఇప్పుడు స్వంత పార్టీ పెట్టీ.ఏపి లో తిరుగుతూ ఉన్నారు.
తన ఫ్యాన్స్ నీ ఓట్లుగా మలుచుకుని.సత్తా చాటాలని 2019 లో ప్రయత్నించారు.
అయితే అవి పెద్దగా ఫలించలేదు.దానితో అయన చాలా కాలం సైలెంట్ అయ్యారు.
తర్వాత ఎన్నికలు వస్తుండటం తో మళ్ళీ రాజకీయాల్లో చురుకుగా అయ్యారు.
ఈ సారి ఫ్యాన్స్ ను ఓటర్లుగా మార్చుకుంటూ నే.తన కులం ఓట్లను రాబట్టు కోవడానికి కుల రాజకీయాలు మొదలు పెట్టారు.గోదావరి జిల్లాలో కాపుల ఓట్ల తో పాటు.
ఉత్తరాంధ్ర లో ఎక్కువగా ఉన్న తూర్పు కాపులు, ఒంటరి, బలిజ లాంటి ఓట్లను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇప్పటికే గోదారి జిల్లాల్లో కాపు ప్లాన్ సక్సెస్ కావడం తో ఇప్పుడు యూత్ పై ఫోకస్ పెట్టారు.అందుకే యువ శక్తి పేరుతో.కుర్రకారు జోష్ పెంచి.వాటి ద్వారా ఓట్లను పెంచుకోవాలని చూస్తున్నారు.వైసీపీ కి ఉన్న యూత్ ను సైతం తన వద్దకు తెచ్చుకోవడానికి ఈ వేదిక ఉపయోగ పడుతుంది అని చూస్తున్నారు.
దీనికోసం ఒక ప్రత్యేక పోర్టల్ ను స్టార్ట్ చేశారు.ఒక మెయిల్ ఐడి సైతం ప్రచారం చేస్తున్నారు.ప్రశ్నించు అంటూ యూత్ ను తట్టి లేపుతునే.తన ఓటు షేర్ ను పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరి నిజంగా సేనాని ప్లాన్ యువశక్తి సభతో సక్సెస్ అవుతుందా.? లేదా చూడాలి
.






