తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ,తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తమన్నా.ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా తమన్నా పెళ్లికి డేటింగ్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆ వార్తలకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
ఎందుకంటే తమన్నా న్యూ ఇయర్ పార్టీలో నటుడు విజయ్ వర్మ పై ముద్దుల వర్షం కురిపించడంతో వారిద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇదే విషయం గురించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.తమన్నా, విజయ వర్మలు ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వారిద్దరి డేటింగ్ సీక్రెట్ బయట పడిపోయింది.
ఈ విషయంపై పలువురి నెట్టిజన్స్ స్పందిస్తూ ఎన్ని రోజులు ఏమీ లేదు అంటూ కవర్ చేసావు మరి ఇదేంటి తమన్నా అంటూ ట్రోల్స్ చేస్తుండగా ఇంకొందరు మాత్రం తమన్నా బాయ్ ఫ్రెండ్ అయినా విజయ్ వర్మపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

అంత అందంగా ఉన్న తమన్నాకి ఇతను తప్ప వేరే వాళ్ళు దొరకలేదా అంటూ విజయ్ వర్మ పెట్రోలింగ్స్ చేస్తున్నారు.తమన్నాకి అతనికి ఏమైనా సరిపోయిందా అంటూ పలువురి నెట్టిజెన్స్ ట్రూల్స్ చేయడంతో ఆ కామెంట్స్ స్పందించిన మరికొందరు నెటిజన్స్ ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకు ఎవరితో డేటింగ్ లో ఉంటే మీకెందుకు.అయినా తమన్నాకు లేని బాధ మధ్యలో వీళ్ళకి ఎందుకు అంటూ సదరు నెటిజన్స్ పై మండిపడుతున్నారు.
అయితే తమన్నా గురించి సోషల్ మీడియాలో రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నప్పటికీ తమన్నా మాత్రం ఇప్పటివరకు ఆ వార్తలపై స్పందించడం లేదు.







