దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొత్త పెళ్లి సందడి తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ శ్రీ లీలా ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.పెళ్లి సందడి సినిమా డిజాస్టర్ గా నిలిచినా కూడా ఆమెకు దక్కుతున్న ఆఫర్లు ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ధమాకా సినిమా లో శ్రీలీలా నటించి మెప్పించింది.ఆ సినిమా లో ఈ ముద్దుగుమ్మ యొక్క డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఫ్యాన్స్ గా మారుతున్నారు.
భలే వేసిందే డాన్స్ అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక ధమాకా సినిమా వంద కోట్ల క్లబ్ లో జాయిన్ కాబోతుంది.
దాంతో శ్రీ లీలా యొక్క క్రేజ్ మరింత పెరిగింది.అందంగా ఉండటంతో పాటు అంతకు మించి ప్రతిభ ఉండటం ఈమెకు కలిసి వస్తుంది.
ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నారు.
అందుకే ఈమె తో సినిమా లకు స్టార్ హీరోలు కూడా రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇటీవల శ్రీ లీలా పారితోషికం విపరీతంగా పెంచేసింది.పాతిక లక్షల రూపాయలను పెళ్లి సందడి సినిమాకు తీసుకున్న

శ్రీలీలా ఆ తర్వాత ధమాకా సినిమాకు 60 లక్షల వరకు పారితోషికంగా తీసుకుందట.ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు అంటూ డిమాండ్ చేస్తుంది.త్వరలో రాబోతున్న సినిమా కనుక సక్సెస్ అయితే కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు సినిమా యొక్క పారితోషికం గా ఈ అమ్మడు పెంచినా ఆశ్చర్యం లేదు అంటూ చాలా మంది సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ఈ అమ్మడి యొక్క డేట్ల ను బుక్ చేసుకుంటున్నారట.ముందు ముందు శ్రీ లీలా యొక్క పారితోషికం ను చిన్న నిర్మాతలు అందుకోవడం సాధ్యం కాదేమో.!
.






