మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్దకు సంక్రాంతి కానుకగా రాబోతున్నాయి.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా పోరాటం సాగించడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే ఈ రెండు సినిమాలు కలిసి ఇప్పుడు దిల్ రాజు వద్ద థియేటర్ల కోసం పోరాటం చేస్తున్నాయి.ఔను చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఆశించిన స్థాయిలో లభించడం లేదు.
అందుకు కారణం దిల్ రాజు ఆరు నెలల క్రితమే తన వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను బుక్ చేసుకున్నాడు.వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు తన వారసుడు సినిమా కంటే కూడా తక్కువ థియేటర్లను ఆయన కేటాయిస్తున్నాడు.
ఇదే సమయంలో ఆయన తునివు సినిమాను కూడా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాడు.
కనుక దిల్ రాజు కావాలని మైత్రి మూవీ మేకర్స్ వారిపై మరియు చిరు, బాలయ్యల సినిమాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కావాలని చిరు మరియు బాలయ్య సినిమాలకు సరైన థియేటర్లను ఇవ్వక పోవడంతో పాటు వారసుడు సినిమాకు మెయిన్ థియేటర్లను మరియు క్రేజ్ ఉన్న థియేటర్లను ఇవ్వడం ను బట్టి చూస్తూ ఉంటే ఈ వ్యవహారం ముందు ముందు చాలా దూరం వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.నైజాం ఏరియాలో మెజార్టీ థియేటర్లు దిల్ రాజు ఆధీనంలో ఉన్నాయి.కనుక వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు కచ్చితంగా డ్యామేజీ తప్పదు.విడుదల తర్వాత జరిగే డ్యామేజీని బట్టి దిల్ రాజు పై మెగా కాంపౌండ్ రియాక్షన్ ఉంటుందని.
బాలయ్య యొక్క తీరు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







