బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి వర్ష ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తుంది.జబర్దస్త్ కార్యక్రమంలో ఇమ్మానుయేల్ తో కలిసి స్కిట్లు చేస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వర్ష వివిధ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ బాగా ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు.
అయితే వర్ష ఇదివరకు వరుస ఫోటోషూట్ల చేసి తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా ఈమె ట్రెడిషనల్, గ్లామర్ లుక్ లో అభిమానులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నారు.ఇక నూతన సంవత్సరం కానుకగా సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే వర్ష కూడా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ బాగా చిల్ అయినట్టు తెలుస్తుంది.

ఒక లగ్జరీ హోటల్లో ఈమె నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఇలా ఈ హోటల్లో చేతిలో మందు గ్లాస్ పట్టుకొని వర్ష చిల్ అవుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా వర్ష తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడంతో అభిమానుల సైతం లవ్ యు వర్ష హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ జబర్దస్త్ భామ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







