1986లో దర్శకుడు విశ్వనాథ్ తీసిన అద్భుతమైన క్లాసికల్ సినిమా స్వాతిముత్యం.ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించగా, రాధిక హీరోయిన్ గా నటించింది.
మంద బుద్ధి కలిగిన పాత్రలో కమల్ నటించగా అత్యంత లోతైన భావాలు కలిగి ఉన్న పాత్రలో రాధిక నటించింది.ఈ సినిమా అప్పట్లోనే ఆస్కార్ కి కూడా వెళ్ళింది.
అంతే కాదు మంచి కమర్షియల్ గా సక్సెస్ కూడా సాధించింది.ఈ సినిమా నటనలో నటించిన కమల్ హాసన్ కి అలాగే నిర్మించిన ఏడిద నాగేశ్వరరావుకి, దర్శకత్వం వహించిన విశ్వనాథ్ కి ఉత్తమ జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి.
స్వాతిముత్యం సక్సెస్ సాధించిన తర్వాత ఆ తమిళంలో డబ్బింగ్ చేయగా అక్కడ కూడా ఘనవిజయం సాధించింది ఆ తర్వాత హిందీ మరియు కన్నడ భాషల్లో రీమేక్ చేయబడింది.ఇక ఈ చిత్రంలో అప్పటికే కమర్షియల్ స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ హాసన్ తన పరిధిని తగ్గించుకొని మందబుద్ధి కలిగిన పాత్రలో నటించడం అప్పట్లో పెద్ద సాహసం అనే చెప్పాలి.
అలాగే అలాంటి ఒక మంద బుద్ది పాత్రకు రొమాంటిక్ సాంగ్ పెట్టడం అంటే అది ఆ దర్శకుడికి కూడా ఎంతో చాలెంజింగ్ విషయం.ఆ పాట మరింటో కాదు మనసు పలికే మౌన గీతం.
ఈ చిత్రంలో కమల్ మరియు రాధిక ఒకరితో ఒకరు ఒదిగిపోయిన తీరు ఎంతో బాగా జనాలను ఆకట్టుకుంది.
అయితే కమల్ హాసన్ రాధికతో ఎలా రొమాన్స్ చేశాడో అచ్చుగుద్దినట్టుగా చిరంజీవి సైతం అలాగే చేయాలని ప్రయత్నించాడట.ఆరాధన సినిమా కోసం హీరోయిన్ సుహాసిని తో చిరంజీవి రొమాన్స్ చేయాల్సి ఉండగా, కమల్ హాసన్ ని కాపీ కొట్టబోయి విఫలమయ్యారట.అయితే ఒకరిని కాపీ కొట్టడంలో ఎలాంటి ఉపయోగం ఉండదని మీలా మీరు నటించండి అంటూ దర్శకుడు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట చిరంజీవి.