సావిత్రి లాగానే ఆది నుంచి అంత్యం వరకు ..చితికి చేరిన నటుడు

తెలుగు లో సావిత్రి గురించి మాట్లాడిన చాల మంది ఎలా బ్రతకాలో ఉదాహరణ గా అలాగే ఎలా బ్రతక కూడదో కూడా ఆమె జీవితాన్ని ఉదాహరణ గా చూడాలి అని చెప్తూ ఉంటారు.అయితే ఇదే మాట కొంచం అటు ఇటు గా చెప్తూ కన్ను మూసినా వ్యక్తి భరత్ భూషణ్.

 Untold Facts About Actor Bharath Bhushan Details, Bharath Bhushan, Actor Bharath-TeluguStop.com

అతడు కన్ను మూస్ క్షణం ముందు చెప్పిన మాట ఏంటంటే .చనిపోవడం గురించి అందరికి తెలుసు.కానీ ఎలా బ్రతకాలో తెలుసుకున్నవాడే బాగుపడతాడు.కానీ అది చాలా మందికి తెలియదు.నాకయితే అస్సలు తెలియదు, తెలుసుకునే సరికి జీవితం ముగింపుకు వచ్చింది.అని చెప్పారు.

సావిత్రి జీవితానికి భరత్ భూషణ్ జీవితానికి పెద్ద తేడా ఏమి లేదు.అయన కూడా ఎంతో వైభోగం చూసారు.

చివరికి ఒక అనామకుడిగా కన్ను మూసారు.తండ్రి లాగ లాయర్ అవుతాడనుకున్న ముంబై కి వచ్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నాడు, అదృష్టం తిరిగింది.నటించిన మొదటి సినిమా తర్వాత అనేక మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.డబ్బు కూడా బాగా సంపాదించాడు.

కార్లు, బంగ్లాలు, ఐశ్వర్యం అంతు లేకుండా వచ్చి పడింది.ఇంకా అంత ఒకే అనుకున్న టైం లో భూషణ్ సోదరుడు రమేష్ మన దగ్గర డబ్బు ఉంది కదా.నా కొడుకుని పెట్టి సినిమా తీద్దాం అని సలహా ఇవ్వడం తో భూషణ్ కూడా సరే అన్నాడు.సినిమా ఒకటి చేసి ఆగిపోతే పర్లేదు.

Telugu Bharath Bhushan, Bharathbhushan-Movie

కానీ ఫ్లాప్స్ వస్తున్న మళ్లి మళ్లి సినిమాలు తీస్తూనే పోయాడు.అంతే ఆస్తులు మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయాయి .రోడ్ మీదకు వచ్చాడు.అప్పటి వరకు నమస్తే పెట్టిన చేతులు పక్కకు వెళ్లిపోయాయి.

డబ్బు అడుగుతాడేమో అని అయినవారు మొహం చాటేశారు.ఆఖరికి పూట గడవని స్థితిలోకి వెళ్ళిపోయాడు.

జూనియర్ ఆర్టిస్ట్ గా, చిన్న చితక వేషాలు వేయడానికి చిన్న చిన్న నిర్మాతల చుట్టూ తిరిగాడు.ఎవరు ఏ పాత్రా ఇస్తే అది చేసాడు.

నా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకున్నాడు.కార్లలో తిరిగిన వ్యక్తి కాస్త బస్సు కోసం బాస్ స్టాప్ లో క్యూ లైన్ లో నిలుచునే వాడు.

వయసు పెరిగిన కొద్ది వ్యాధుల బారిన పడ్డారు.చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక చివరికి ఆ రోగం ఎంటో కూడా తెలుసుకోలేక 1992 లో అనారోగ్యం తోనే కన్ను మూసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube