ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూసే విషయంలో ఫ్యాన్స్ పూర్తిగా మారిపోయారు.పెద్ద సినిమాలను, హిట్ టాక్ వచ్చిన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.
టికెట్ రేట్లు అంతకంతకూ పెరుగుతుండటంతో పాటు తక్కువ ఖర్చుతో ఓటీటీలలో వినోదం అందుబాటులో ఉండటంతో సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిస్థాయిలో మారిపోతున్నాయి.
అయితే రాజయోగం సినిమా మేకర్స్ తమ సినిమాను చూసే ప్రేక్షకులకు లక్ష రూపాయల బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఈ సినిమా చూసి నవ్వకుండా ఉండగలిగితే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని మేకర్స్ ప్రకటించారు.అయితే మేకర్స్ సరదాగానే ఈ ఆఫర్ ను ప్రకటించారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
సినిమాకు ప్రమోషన్స్ జరగడానికి ఇది మేకర్స్ చేసిన ప్లాన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు థియేటర్ల ద్వారా కంటే డిజిటల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం చేకూరుతుంది.మరోవైపు సంక్రాంతి పండుగ కానుకగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.సంక్రాంతి సినిమాలు విడుదలైతే థియేటర్లు మళ్లీ కళకళలాడే అవకాశం అయితే ఉంటుంది.
సంక్రాంతి సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నెల లాస్ట్ వీక్ వరకు సినిమాలు అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది.సంక్రాంతి సినిమాల థియేటర్ల లెక్కలు తేలాల్సి ఉందని బోగట్టా.సంక్రాంతి సినిమాలలో ఏ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది.తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో తమిళ హీరోల సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.