ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెరపై ఒకదాని తర్వాత ఒకటి కామెడీ షోలు పుట్టుకొస్తున్నాయి.ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం ఒక్కొక్కటిగా షోలు తయారవుతున్నాయి.
అయితే ఇప్పుడు కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా ఓటిటి లో కూడా ఎంటర్టైన్మెంట్ షోలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.కాగా ఇప్పటికే తెలుగులో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు, స్టార్ట్ మ్యూజిక్ ఇలా ఎన్నో షోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
డాన్స్ షోలో మొదలుపెట్టిన అందులో కూడా ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత అందిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఆ షోకి సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు.కాగా ఈ షోకి ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కామెడీ ఎక్స్ చేంజ్ షో నుండి మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.ఇక ఆ ప్రోమో కామెడీతో ఆధ్యంతం ఆకట్టుకుంది.
కాగా ఎందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 6న ఓటీటీ ఆహాలో ప్రసారం కానుంది.ఇకపోతే ఈ షో ప్రారంభంలో సుధీర్ దీపికాల ఎంట్రీ డాన్స్ హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.

ఇద్దరు స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు స్టెప్పులను ఇరగదీశారు.ఆ తర్వాత మళ్లీ కామెడీ మొదలు పెడుతూ ఇందులో పటాస్ షో కమెడియన్స్, అలాగే జబర్దస్త్ కమెడియన్ కలసి స్కిట్లు వేశారు.వారి కామెడీకి సుధీర్ తో పాటు అనిల్ రావి కూడా కడుపబ్బా నవ్వుకున్నాడు.ఇక సుధీర్, దీపికా పిల్లి ల ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలి అంతే జనవరి 6 వరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే సుడిగాలి సుధీర్ విషయానికి వస్తే.వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పిన ఇటీవలె కొంచెం గ్యాప్ తీసుకున్నాను మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే.
సుధీర్ ఎంట్రీ ఇస్తానని చెప్పి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఎంట్రీ ఇవ్వలేదు.







