బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో పర్యటించనున్నారు.పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ పర్యటన కొనసాగనుంది.
ఈ క్రమంలో పార్టీ కార్యకలపాలు నిర్వహించేందుకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది.
ఈ మేరకు విజయవాడ లేదా గుంటూరులో సభ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.అదేవిధంగా విశాఖలోనూ కేసీఆర్ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ తర్వాత కర్నాటక, మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ ను కేసీఆర్ విస్తరించే యోచనలో ఉన్నారని సమాచారం.కర్నాటకలో జేడీఎస్ తో, మహారాష్ట్రలో పలు చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోనున్నారు.
జనవరి చివరి నాటికి మూడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి.







