సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్.. నాకెంతో స్పెషల్ అంటూ?

కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట గత ఏడాది జూన్లో వివాహం చేసుకుని ఒకటైన విషయం తెలిసిందే.2016 నుంచి సహజీవనం చేసి ఆరేళ్ల తర్వాత ఒక్కటయ్యారు.కాగా కోలీవుడ్లో నయనతార విజయ్ సేతుపతి కలిసి నటించిన నానుమ్ రౌడీధాన్ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు.

 Director Vignesh Shivan Emotional Post About 2022 Year Ends Goes Viral Details,-TeluguStop.com

ఆ సినిమా సమయంలో నయనతార, విగ్నేష్ శివన్ ల మధ్య ప్రేమ మొదలైంది.ఇకపోతే గత ఏడాది ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో 2022 కి గుడ్ బాయ్ చెబుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో విగ్నేష్ శివన్ ఈ విధంగా రాసుకొచ్చాడు.గత ఏడాది 2022లో జరిగిన విషయాలను ఆ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

తనకు 2022 సంవత్సరం ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిందని, నయనతార తో పెళ్లి, స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు మరిచిపోలేనివి అని తెలిపారు విగ్నేష్ శివన్.అలాగే 2022లోనే కవల పిల్లలు జన్మించడం అన్నదే దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని తెలిపారు.

అలాగే కాతు హక్కుల రెండు కాదల్ సినిమా రిలీజ్ అవ్వడం, తమిళనాడు ప్రభుత్వం చెస్ ఒలిపింయాడ్ ఆహ్వానం, నయనతార కనెక్ట్ మూవీ రిలీజ్ అవ్వడం, అలాగే తదుపరి ప్రాజెక్టు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఏకే62 సినిమా గురించి కూడా ఇందులో ప్రస్తావించారు.అలా మొత్తానికి 2022 ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిందని, 2022 తనకి ఎంతో స్పెషల్ అని 2022 కి గుడ్ బాయ్ చెబుతూ ఎమోషనల్ పోస్టులు రాసుకొచ్చాడు.వరుసగా ట్వీట్స్ చేయడంతో అభిమానులు వాటిపై ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు.విగ్నేష్ శివన్ పెద్ద ఎత్తున న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube