ఫిఫా వరల్డ్ కప్‌లో క్రిస్టియానో రొనాల్డో అంచనాలు అందుకోకపోయినా, తన బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని ఒకే ఒక్క సంతకంతో నిరూపించాడు.అవును, ఏకంగా ఒకే ఒక్క డీల్‌తో 4,400 కోట్ల రూపాయలు తన సొంతం చేసుకున్నాడు.
విషయం ఏమంటే, ఆమధ్య మాంచెస్టర్ యునైటెడ్ చేత తొలగించబడిన రొనాల్డో.తాజాగా భారీ డీల్‌తో మరో క్లబ్‌తో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ – రొనాల్డో మధ్య ఒప్పందం కుదరింది.
ఈ నూతన ఒప్పందం ప్రకారం రొనాల్డో ఒక్క సంవత్సరానికి 200 మిలియన్ యూరోలు అంటే మన కరెన్సీలో 1700 కోట్లు సంపాదించనున్నాడు.
కాగా ఈ డీల్ 2025 జూన్ వరకు కుదిరింది.అంటే మొత్తంగా మన ఇండియన్ కరెన్సీలో రూ.4400 కోట్ల రూపాయిలు సౌదీ క్లబ్ అతగాడికి చెల్లించనుంది.ఈ డీల్ వలన ఫుట్ బాల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు.
ఈ డీల్ అనంతరం రోనాల్డో మాట్లాడుతూ అల్-నాసర్ తో కలిసి ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ… ఆసియా ఆటగాళ్లతో నా అనుభవాన్ని పంచుకునేందుకు ఇదే సరైన సమయం అని అన్నాడు.ఇక అల్-నాసర్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ… రొనాల్డ్తో కుదుర్చుకున్న డీల్ తమ దేశ భవిష్యత్తు తరాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తుందని తెలిపింది.అల్ నాసర్ – రొనాల్డో డీల్ తర్వాత కొన్ని గంటలకే క్లబ్ యొక్క ఇన్‌స్టా ఫాలోయింగ్ 3 రెట్లు పెరగడం గమనార్హం.860K ఫాలోవర్స్ వున్నవారు కాస్త 2.9 మిలియన్లకు పెరిగిపోవడం కొసమెరుపు.ఇందుకోసం ప్రధాన కారణం రొనాల్డో క్లబ్ యొక్క ఇన్ స్టా ఖాతాను ఫాలో అవ్వడమే అని వేరే చెప్పాల్సిన పనిలేదు.







