సాధారణంగా చాలామంది ప్రజలు కొరియర్ సర్వీస్ ద్వారా వస్తువుల రవాణా చేస్తూ ఉంటారు.ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి కొరియర్ సర్వీస్ జరుగుతూ ఉంటుంది.
అయితే తాజాగా కొరియర్ అధికారులను ఒక సంఘటన షాక్ కు గురి చేసింది.అయ్యబాబోయ్ ఇది నేను ఎప్పుడు చూడలా అన్నట్లు చేసింది.
తాజాగా ఒక ఎయిర్పోర్టులో కొరియర్ ను చూసి కొరియర్ అధికారులు అయ్యబాబోయ్ అంటూ దూరంగా పరుగు తీయాల్సి వచ్చింది.మెక్సికో ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఎయిర్పోర్ట్ అధికారులను షాక్కు గురి చేసింది.
సెంట్రల్ మెక్సికో లోని క్వెరెటారో ఇంటర్ కాంటినెంటల్ ఏర్పాటు లో కార్డు బోర్డు పెట్టెలో అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసిన మనిషి పుర్రెలు కనిపించడం తో దాదాపు అక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్ అధికారుల గుండె ఆగినంత పని అయింది.అమెరికాకు కొరియర్ ద్వారా పంపిన ఈ కార్డు బోర్డులో పుర్రెలను అధికారులు గుర్తించారు.
మెక్సికోలోని అత్యంత హింసాత్మక ప్రాంతంలో ఒకటేనా పశ్చిమ తీరా రాష్ట్రమైనా మిచోకాన్ నుంచి ఈ ప్యాకేజ్ కవర్ వచ్చిందని సమాచారం.దీనిని దక్షిణ కరోలినాలోని మన్నింగ్‌కు కొరియర్ చేశారని అధికారులు చెబుతున్నారు.

ఈ పుర్రెలకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియలేదు.ఇంకా చెప్పాలంటే ఈ పురెల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న మెక్సికో విమానాశ్రయ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.ఈ పుర్రెలు ఎవరికి సంబంధించినవి? ఎవరు పంపారు? ఎక్కడికి పంపారు? ఎందుకు పంపారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఈ పుర్రెల వ్యవహారంపై మెక్సికో ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.








