దివంగత వైయస్ఆర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.వైయస్సార్ తనకిష్టమైన రాజకీయ నేత అని తెలిపారు.

 Jaggareddy Sensational Comments On Late Ysr Details, Jaggareddy, Ysr, Congress M-TeluguStop.com

వైయస్సార్ గురించి విన్నది ఒకటైతే.చూసింది మరొకటి అని వ్యాఖ్యానించారు.

ఆయన గురించి ఎక్కువగా ఫ్యాక్షనిస్ట్ అని చాలామంది చెబుతూ ఉండేవాళ్ళు అదొక చరిత్ర అని తెలిపారు.కానీ రాజశేఖర్ రెడ్డిలో నేను గమనించిన అంశం శత్రువునైనా సరే ఆదరించే గుణం కలిగిన వ్యక్తి అని కొనియాడారు.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా గాని శత్రువు కలవడానికి వస్తే ఆప్యాయంగా ఆదరించే స్వభావం వైయస్ రాజశేఖర్ రెడ్డికి సొంతమని కొనియాడారు.రాజుల కాలంలో ఇటువంటి స్వభావం ప్రదర్శించేవారు.

ఆ తర్వాత వైయస్సార్ ఆ రీతిగా శత్రువుల పట్ల వ్యవహరించే వాళ్ళు.వైయస్సార్ తీసుకొచ్చిన “ఆరోగ్య శ్రీ” ఎంతో గొప్ప పథకం అని తెలిపారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో అనుకోని కారణాలవల్ల తన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube