1.ఏపీ సిఎస్ కు లేఖ
ఏపీ సెక్రటరియెట్ సిపిఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ సిఎస్ కు లేఖ రాశారు.పెండింగ్ డిఏ , పీఆర్సీ బకాయిలు పెన్షన్ ఫండ్ కు సకాలంలో కంట్రిబ్యూషన్ చెల్లింపు ప్రభుత్వ భాగం అయిన 14% వెంటనే చెల్లించాలని కోరుతూ లేఖ రాశారు.
2.నూతన డిజిపిగా అంజనీ కుమార్
తెలంగాణ నూతన డిజిపిగా అంజన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
3.భక్తులు తగ్గారనేది అవాస్తవం : దుర్గగుడి ఈవో
బెజవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం కు భక్తుల రాక తగ్గిందనేది అవాస్తమని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.
4.ఒకటి నుంచి నూమాయిష్
అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన 2023 ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.జనవరి ఒకటో తేదీ నుంచి నూమాయిష్ ప్రారంభం కానున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విని మార్గం తెలిపారు.
5.జగన్ పై చంద్రబాబు కామెంట్స్
జగన్ రెడ్డి పాలెం లో రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి వచ్చిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.
6.అయ్యప్ప స్వాముల నిరసన ర్యాలీ
ఏలూరులో అయ్యప్ప స్వాములు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.తెలంగాణలోని వరంగల్ కు చెందిన బైరి నరేష్ అయ్యప్ప స్వాములపై అణిచిత వ్యాఖ్యలు చేయడానికి వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.
7.ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి.పీవీ సునీల్ కుమార్, మహేష్ దీక్షిత్, అమిత్ గార్గ్ లకు డీజీపీ ర్యాంకులు వచ్చాయి.వీరంతా 1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారులు.
8.బిపి మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు బ్రేక్
గుంటూరులోని అమరావతి రోడ్ లో బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు పనులకు మళ్లీ బ్రేక్ పడింది.పనులు మొదలుపెట్టిన రోజే టౌన్ ప్లానింగ్ అధికారులు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు.
9.తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పదవి విరమణ
తెలంగాణ పోలీస్ అకాడమీలో డిజిపి మహేందర్ రెడ్డి పదవీ విరమణ ఉత్సవ్ ఫెరేడ్ ను ఘనంగా నిర్వహించారు.
10.సంక్రాంతి కోసం 16 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ కోసం ప్రయాణికుల డిమాండ్ మేరకు అనేక ప్రాంతాలకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
11.వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.
12.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు 26 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.
13.దేవదాయ ఈవో మెయిన్స్ పరీక్ష
దేవదాయ శాఖలో గ్రేట్ పోస్టులకు మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
14.నకిలీ ఉద్యోగులపై లోకయుక్త ఆందోళన
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య పెరిగిపోయిందని లోకయుక్త ఆందోళన వ్యక్తం చేసింది.
15.తిరుపతి లో కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు
తిరుపతి లో కొత్త సంవత్సర వేడుకల పై పోలీసులు ఆంక్షలు విధించారు.
16.అయ్యప్ప స్వాముల పై అనుచిత వ్యాఖ్యలు : అరెస్ట్
అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ కు చెందిన బైరి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
17.పవిత్ర లోకేష్ తో పెళ్లి పై నరేష్ కామెంట్స్
త్వరలోనే సహనటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ నటుడు నరేష్ వెల్లడించారు.
18.బీజేపీ నాకు గురువు : రాహుల్ గాంధీ
భారతీయ జనతా పార్టీ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను తాను గురువులా భావిస్తాను అని కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
19.విశాఖను రాష్ట్రంగా ప్రకటించాలి
విశాఖను రాజధానిగా చేయాల్సిందేనని లేకపోతే కొత్త రాష్ట్రంగా అయినా ప్రకటించాలని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
20.ఢిల్లీకి వెళ్లిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల శీతాకాల విడిది ముగిసింది.దీంతో ఆమె హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు.